కియారా అద్వాణీ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలో.. బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఓ టీవీ షోలో జరిగిన కార్యక్రమంలో తన హైస్కూల్ రోజుల్లోని ప్రేమాయణం గురించి తెలిపింది. తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచి చూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. మరోవైపు చదువును అశ్రద్ధ చేస్తున్నానంటూ నా తల్లిదండ్రులు కోప్పడేవారు. ఈ సంఘర్షణ నడుమ నా ప్రేమను త్యాగం చేశాను. ఆ సమయంలో నేను మానసిక ఎంతో ఆవేదనకు గురయ్యాను. వయసుపరంగా వచ్చిన పరిపక్వతతో క్రమంగా కోలుకున్నా’ అని చెప్పింది ఈ బ్యూటీ.