HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌కు నో చెప్పిన కైరా అద్వాని

పవన్‌ కల్యాణ్‌కు నో చెప్పిన కైరా అద్వాని

2 8
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్ లో చేస్తున్న పవన్, త్వరలో హరీశ్ శంకర్ .. క్రిష్ సినిమాలను కూడా చేయనున్నాడు. ఈ రెండింటిలో క్రిష్ తో చేయనున్నది భారీ చారిత్రక చిత్రం. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు.

అయితే ఈ చిత్రంలో పవన్‌కు జంటగా కైరా అద్వానిని తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ జంట మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని సీని పెద్దలు భావించారు. అయితే వాళ్లకి నిరాశను కలిగిస్తూ ఆమె నో చెప్పేసింది. బాలీవుడ్‌లో భారీ సినిమాలతో బిజీగా వున్న కైరా, ప్రస్తుతం డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. దాంతో వాణీ కపూర్ ను ఎంపిక చేసే ఆలోచనలో క్రిష్ వున్నాడని అంటున్నారు. 2014లో వచ్చిన ‘ఆహా కల్యాణం’లో నాని జోడీగా వాణీ కపూర్ కనిపించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu