టాలీవుడ్‌లో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాల్లో మెరిసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవల విడుదలైన ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌తోపాటు దక్షిణాది నుంచి కూడా అవకాశాలు అందుకుంటోంది ఈ భామ. ఈమె బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వినిపించాయి. అతనితో కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు హాజరుకావడంతో వీరి గురించి గాసిప్‌లు వచ్చాయి.
తాజాగా తన లవ్‌లైఫ్ గురించి కియార మాట్లాడింది. `ప్రేమ అనేది వ్యక్తిగతం. దానిని కెరీర్‌తో ముడిపెట్టలేము. ప్రేమ అనేది ఎప్పుడైనా, ఎవరి మీదైనా పుట్టొచ్చు. అయితే ప్రస్తుతానికి నేను ప్రేమలో లేను. అయినా నేను ప్రేమలో పడితే దాచుకోను. ఆ అందమైన భావనను వెల్లడించాల్సిందే. సినిమా కెరీర్‌కు ప్రేమ అడ్డంకి కాద’ని కియారా తెలిపింది.