విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి . రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఈ రోజు ప్రేనక్షకుల ముందుకు వచ్చింది. నేడు గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకున్నాడని ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ చెబుతున్నాయి. ఖుషి సందడి చేసే ప్లాట్‌ఫాం గురించి ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఖుషి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఖుషి అప్డేట్స్ కు మంచి స్పందన వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. పాజిటివ్ టాక్‌తో ఓపెనింగ్స్ మొదలుపెట్టిన ఖుషి వసూళ్లపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే.