
Nayanthara Mookuthi Amman 2 updates:
ప్రముఖ తమిళ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సుందర్ సి దర్శకుడు. అయితే, ఇటీవల సెట్స్‌లో నయనతార సహాయ దర్శకుడిపై ఘాటుగా స్పందించి, షూటింగ్‌ను నిలిపివేసిందనే వార్తలు వైరల్ అయ్యాయి.
వీరంగా ప్రవర్తించిన నయనతార తీరుకు దర్శకుడు సుందర్ సి షాక్ అయ్యారని, ఆమె స్థానంలో తమన్నాను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారని కూడా ప్రచారం సాగింది. అయితే, నయనతార అభిమానులు మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.
ఈ గాసిప్‌లపై దర్శకుడు సుందర్ సి భార్య, నటి ఖుష్బూ స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “ఇవి పూర్తిగా అవాస్తవాలు. నయనతార ఎంతో ప్రొఫెషనల్ హీరోయిన్. షూటింగ్ చాలా సజావుగా జరుగుతోంది” అని పేర్కొన్నారు.
అయితే, ఈ వివరణ వచ్చిన తర్వాత కూడా కొందరు నెటిజన్లు “అంతా బాగుంటే ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి?” అని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ నయనతార ప్రవర్తనపై వివాదాలు ఉండటం వల్ల ఈ వార్తలు నిజమే అయ్యుండొచ్చని కొందరు కోలీవుడ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ సినిమాతో నయనతార మరింత బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. అసలైన నిజాలు ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.