టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను ‘ఉగాది’ కానుకగా చిత్రబృందం విడుదల చేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌లో రవితేజ నటన, స్టైల్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘క్రాక్’ వంటి కమర్షియల్ హిట్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రమిది. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జయంతిలాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.