HomeTelugu Newsద‌ర్శ‌కుడు బాల స‌మ‌ర్ప‌ణ‌లో 'కాళి'!

ద‌ర్శ‌కుడు బాల స‌మ‌ర్ప‌ణ‌లో ‘కాళి’!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల త‌మిళంలో నిర్మించిన ‘చండివీర‌న్‌’ తెలుగులో ‘కాళి’ అనే పేరుతో అనువాద‌మ‌వుతోంది. బి స్టూడియోస్ ప‌తాకంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. అధర్వ‌, ఆనంది, లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.  శ‌ర్కున‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్‌, శ్రీ గ్రీన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎం.ఎం.ఆర్‌. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు.  
నిర్మాత ఎం.ఎం.ఆర్ మాట్లాడుతూ.. ”ఫ‌క్తు ప‌ల్లెటూరి చిత్ర‌మిది. నీటి కోసం రెండు ఊర్ల మ‌ధ్య జ‌రిగిన పోరాటం ఇందులో ఉంటుంది. సంక్రాంతి సంబ‌రాల నుంచి, ప‌ల్లెటూరి స‌ర‌సాలు, స‌ర‌దాల వ‌ర‌కు అన్నీ ఇందులో ఉన్నాయి. తొలి స‌గం ఆద్యంతం క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. రెండో స‌గం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. స‌న్నివేశాల మూడ్‌కు అనుగుణంగా సాగే పి.జి.ముత్త‌య్య కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సామాజిక స్పృహ‌తో సాగే చిత్ర‌మిది. అనువాద ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. అరుణ‌గిరి అందించిన బాణీలు త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతాయి. స‌బేష్ – ముర‌ళి నేప‌థ్య సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. అధర్వ‌, ఆనంది మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ స్క్రిప్ట్ న‌చ్చి త‌మిళంలో ఈ చిత్రాన్ని బాల నిర్మించారు. తెలుగులో ఆయ‌న స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు వారికి కూడా త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. డిసెంబ‌ర్ లో పాట‌ల‌ను, చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం” అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu