శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా తన కెరీర్‌లో సుదీర్ఘ కెరీర్‌లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు.
చెల్లాట సినిమా ఆయన కెరీర్‌కు మాంచి బ్రేక్ ఇచ్చింది. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచిన కేజీయఫ్, కేజీయఫ్-2 చిత్రాల్లో కూడా ఆయన నటించారు. మోహన్ జునేజా మృతి పట్ల శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.