గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఇది ఎందుకంటే ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ కూడా పవన్ అభిమాని కావడం తో పవన్ ఫ్యాన్స్ ని ఎట్టి పరిస్థితు ఈసారి గబ్బర్ సింగ్ ని మించేలా కంటెంట్ తో రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయితే .. భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కేస్తుంది.
తాజాగా భవదీయుడు భగత్ సింగ్ గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం హరీష్ శంకర్.. రవీనా టాండన్ ని సంప్రదించారని. పాత్ర నచ్చడంతో ఆమె ఓకె చెప్పిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేజిఎఫ్ 2తో రవీనా టాండన్ పేరు మారుమోగుతోంది. ప్రధాన మంత్రి రమిక సేన్ పాత్రలో రవీనా అదరగొట్టేసింది ఈ న్యూస్ నిజమైతే భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం. మరి త్వరలోనే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.