Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. టాలీవుడ్‌లో నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి ఆ తరువాత పలు సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’.. తన మూవీ కెరీయర్‌లోనే బస్ట్ మూవీ అని చెప్పావచ్చు.
ఈ సినిమాలో సావిత్రిలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాకి గాను పలు అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాను కీర్తి సురేష్ తప్ప మరెవ్వరూ చేయలేరు అనే విధంగా నటించి మెప్పించింది కీర్తిసురేష్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో ఆమె రేంజ్ కూడా మారిపోయింది. అయితే తాజాగా మరో బయోపిక్ లో కీర్తి సురేష్ నటించబోతుందని ఓ వార్తలు కొలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రముఖ గాయని, గాన కోకిల ఏంఎస్ సుబ్బలక్ష్మి గారిది. ఈ సినిమా గురించి గతంలో ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ ను వెతికేపనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆవిడ జీవితాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. నిర్మాణ సంస్థ, దర్శకుడు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఏంఎస్ సుబ్బలక్ష్మిగా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సుబ్బులక్ష్మి జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి. 1938లో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బులక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. నటేశ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది. తమిళ సినిమాలలో గాయనిగా నటిగా కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది.
1945 వ సంవత్సరంలో నిర్మించబడిన ‘మీరా’ చిత్రం హిందీలో రీమేక్ కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. ‘మీరా’ సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. 1997లో భర్త చనిపోయాక పాడటం ఆపేసిన ఈ అజరామర గాయని 2004లో కన్ను మూశారు.
భక్తి పాటలతో ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేసే అనిర్వచనీయ మహత్తు ఆవిడ గాత్రంలో ఉండేది. ఒకవేళ కీర్తి సురేష్ తో సాధ్యపడకపోతే నయనతార, త్రిష పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. ప్రస్తుతానికి ఇంతకు మించిన వివరాలు లేవు. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.