
Keerthy Suresh:
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న, ఒక చిన్న, సన్నిహిత కార్యక్రమంలో కీర్తి తన ప్రియుడు ఆంటోనితో వివాహం చేసుకుంది. 15 సంవత్సరాల ప్రేమ కథను ప్రపంచానికి పరిచయం చేస్తూ కీర్తి, తన ప్రేమను పెళ్లిగా మార్చుకుంది. కాలేజి రోజుల నుంచే ప్రేమించిన వ్యక్తితోనే తన ఏరుగులు వేసింది ఈ హీరోయిన్.
గోవాలో డిసెంబర్ 12న జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్, మొదట హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం జరిగి అందరిని ఆకట్టుకుంది.
పెళ్లి పూర్తయ్యాక, కీర్తి తన సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడం మొదలు పెట్టింది. ఈ ఏడాది, కీర్తి బాలీవుడ్‌లో సైతం అడుగుపెట్టింది. వరుణ్ ధావన్‌తో కలిసి “బేబీ జాన్” అనే సినిమాలో నటించింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయవంతం కాలేదు. దీంతో కీర్తి కొంత నిరాశ చెందింది. అయితే పెళ్లి తర్వాత ఆమె తాళిబొట్టు ధరించి కొన్ని రోజులు కనిపించింది. ముఖ్యంగా బేబీ జాన్ ప్రమోషన్స్ మొత్తం కీర్తి సురేష్ తాళిబొట్టు వేసుకొని కనిపించింది.
చాలా మంది ఆమెను ప్రశంసించారు, కానీ కొన్ని రోజుల క్రితం, భర్తతో చేసిన ఫొటోషూట్‌లో కీర్తి తాళిబొట్టు లేకుండా కనిపించింది. ఈ ఫొటోలు షేర్ చేసిన తరువాత, నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. “రెండు నెలలకే తాళిబొట్టు బరువైందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సినిమా ప్రమోషన్స్ లో కూడా తాళిబొట్టు వేసుకుని కనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు అసల వాటిని పట్టించుకోకుండా.. ఇంస్టాగ్రామ్ ఫొటోల్లో కూడా మామూలుగానే కనిపిస్తోంది. దీంతో పెళ్లయిన రెండు నెలలకే ఇంత షాక్ ఇచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.