Keerthy Suresh Anthony Thattil Love Story:
టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన సుదీర్ఘకాల ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను డిసెంబర్ 12న గోవాలో సంప్రదాయ దక్షిణాది స్టైల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక తర్వాత, డిసెంబర్ 15న వైట్ వెడ్డింగ్ కూడా జరగింది. ఈ రెండు వేడుకల గురించి కీర్తి సురేశ్ ఇటీవల గలట్టా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తమ ప్రేమకథను గురించి చెబుతూ, “ఇది నిజంగా ఒక కలల. మా మధ్య తొలిసారి ప్రేమ మొదలైనప్పుడు ఇదంతా సాధ్యమవుతుందని అనుకోలేదు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అతనితో డేటింగ్ స్టార్ట్ చేశాను. ఆయన నాకంటే ఏడేళ్లు పెద్దవాడు,” అని కీర్తి గుర్తు చేసుకున్నారు.
View this post on Instagram
ఆంటోనీ తట్టిల్‌తో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి చెబుతూ, “5-6 ఏళ్ల పాటు మా మధ్య దూరం ఉండేది. నేను కాలేజీలో ఉంటే, ఆయన ఖతర్‌లో వర్క్ చేస్తుండేవారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి కొచ్చిలో తన బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెన్నైలో సెట్ అవుతున్నారు. భవిష్యత్తులో దుబాయ్‌లో కూడా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు,” అని చెప్పింది.
కీర్తి తన జీవిత ప్రయాణంలో ఆంటోనీకి ఇచ్చిన మద్దతును వివరించారు. “ప్రతి అమ్మాయి తండ్రిని సూపర్‌హీరోగా చూసుకుంటుంది. తన తండ్రి తర్వాత, సపోర్టివ్ పాత్రలో వేరే వ్యక్తిని చూసుకోవాలి అంటే, అది తన జీవిత భాగస్వామే అవుతాడు. నా తండ్రిలో ఉన్న కొన్ని లక్షణాలు ఆంటోనీలో కనిపిస్తాయి,” అని కీర్తి అన్నారు.
క్రిష్టియన్ వెడ్డింగ్ గురించి మాట్లాడుతూ, మా నాన్నని అడిగాను, ‘డాడ్స్ పెళ్లి కూతురిని నడిపించుకుంటూ తీసుకువస్తారు. మీరు కూడా నాతో రావాలనుకుంటారా?’ అని. ఆయన వెంటనే తప్పకుండా. రెండు రకాలుగా అంటే ఇలా కూడా చేయలిగా మరి!’ అని చెప్పారు. ఆయన అలా ఒప్పుకోవడం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది,” అని తెలిపారు.
ALSO READ: అందుకే కియారా అద్వానీ Game Changer ప్రమోషన్లకి దూరంగా ఉంటోందా?