HomeTelugu Trendingసీనియర్‌ హీరోయిన్‌లతో కీర్తి సురేష్‌ సెల్ఫీ

సీనియర్‌ హీరోయిన్‌లతో కీర్తి సురేష్‌ సెల్ఫీ

Keerthy Suresh selfie withస్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు లో మరియు తమిళంలో సినిమాలలో నటస్తూ.. బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి. దీపావళికి ‘అన్నాత్తే’ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాలో రజినీ కాంత్ కు చెల్లిగా కీర్తి సురేష్ నటించిన విషయం ఇప్పటికే రివీల్ అయ్యింది. ఒక వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ మరో వైపు ఇలా చెల్లి పాత్రలు ఏంటీ అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కూడా మంచి పాత్ర అంటూ కీర్తి సురేష్ అన్నాత్తేలో నటించిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా అన్నాత్తే ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ ఇలా సీనియర్ స్టార్ హీరోయిన్స్ తో సెల్ఫీ తీసుకుంది.

అన్నాత్తే సినిమా లో సీనియర్ హీరోయిన్స్ అయిన మీనా మరియు ఖుష్బు లు కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన అన్నాత్తే సినిమా విడుదల నేపథ్యంలో వీరంతా కూడా కలిసి మీడియా ముందుకు వచ్చారు. సినిమా ను రజినీకాంత్ అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రమోట్ చేయడంలో విఫలం అయ్యాడు. దాంతో ఈ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీళ్లు ముందుకు వచ్చారు. దర్శకుడు శివ మరియు చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఈ ముగ్గురు హీరోయిన్స్ కలిసి సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఆమె ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ సినిమా ప్రమోషన్ లో ఆమె కనిపించలేదు.ఈ ముగ్గురు మాత్రమే ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu