మెగాస్టార్ చిరంజీవి తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళమ్’ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తిసురేశ్ ను ఫైనల్ చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే కీర్తిసురేశ్ ఈ చిత్రం కోసం భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు కీర్తిసురేశ్ డిమాండ్ ను మేకర్స్ అంగీకరించారట. ముందుగా ఈ పాత్ర కోసం సాయిపల్లవిని అనుకున్నారు. కానీ సాయిపల్లవి కొంత చిన్న వయస్సుగా కనిపించడంతో.. కీర్తిసురేశ్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 జనవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం.