HomeTelugu Trendingఫస్ట్‌ లవ్‌ లెటర్‌ గురించిన చెప్పిన కీర్తి సురేష్‌

ఫస్ట్‌ లవ్‌ లెటర్‌ గురించిన చెప్పిన కీర్తి సురేష్‌

Keerthi suresh love letterటాలీవుడ్‌లో ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కీర్తి సురేష్. తొలి చిత్రం నుంచే కీర్తి సురేష్ ప్రేక్షకుల మనస్సు దోచుకున్న కీర్తి ‘మహానటి’ ‘సినిమాతో అయితే కీర్తి సురేష్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నట విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా ఆ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయేందుకు కీర్తి సురేష్ కొంత బరువు కూడా పెరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాలేజీ రోజుల్లో తనకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కీర్తి సురేష్‌.

తనకు కాలేజీ రోజుల్లో ఎవరూ ప్రేమ లేఖను రాయలేదని చెప్పిన ఆమె “నేను ఒకసారి జ్యూయెలరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లాను. అక్కడికి వచ్చిన ఓ అభిమాని, నాకు ఓ బహుమతిని ఇచ్చి వెళ్లాడు. అందులో నా ఫోటోలను అల్బమ్ గా ఎంతో చక్కగా అమర్చాడు. వాటితో పాటే ఓ ఉత్తరాన్ని కూడా అతను రాశాడు. అందులో ఏముందని చూస్తే, నాకు ప్రపోజ్ చేస్తూ లవ్ లెటర్ రాశాడు. దాన్ని నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను” అని చెప్పింది ఈ అమ్మడు. తాజాగా కీర్తి నటించిన ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్ దే’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu