టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ తన పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు, ఫొటోలను చూసి షాకయ్యాను అన్నారు. ఇటీవల నితిన్ హీరోగా నటిస్తున్న ‘రంగ్ దే’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ‘నా పెళ్లి గురించి చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో పోస్టులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. వాటిని చూసి షాకయ్యాను. కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. మొదట వాటిని చూసి షాక్ అయ్యాను. తర్వాత నవ్వుకున్నాను. కానీ, ఒక్కటి మాత్రం పక్కా చెప్పగలను.. నా పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా.’ అని కీర్తి సురేశ్ తెలిపారు.