HomeTelugu Trendingఅలాంటి పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్‌ చేసుకుంటా: కీర్తి సురేశ్‌

అలాంటి పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్‌ చేసుకుంటా: కీర్తి సురేశ్‌

Keerthy suresh about castin

క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్‌ కీర్తి సురేశ్ స్పందించారు. తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, ఇతర నటులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారని వివరించారు. మన ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ఈ విషయంలో ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. మనం ఎలా ఉంటున్నాం.. ఏం చేస్తున్నామనేదాన్ని బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూసే మహిళలకు వేధింపులు నిజమేనని, క్యాస్టింగ్ కౌచ్ ఉందని హీరోయిన్ కీర్తి సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే, తనకు ఇంతవరకూ అలాంటి అనుభవం ఎదురుకాలేదని ఆమె వివరించారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటానని తేల్చిచెప్పారు. అంతేకానీ అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని స్పష్టం చేశారు. కీర్తి సురేశ్ ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి సినిమా భోళాశంకర్ తో పాటు మామన్నన్, సైరన్ సినిమాల్లో నటిస్తూ కీర్తి బిజిగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu