HomeTelugu Big Storiesఅజిత్ సరసన పవన్ హీరోయిన్!

అజిత్ సరసన పవన్ హీరోయిన్!

గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న అజిత్.. శివ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ దర్శకుడితో గతంలో ఆయన చేసిన ‘వీరమ్’.. ‘వేదాళం’.. ‘వివేగం’ భారీ విజయాలను సాధించాయి. అయితే ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ‘విశ్వాసం’ అనే  టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది.  ద్విపాత్రాభినయం చేస్తున్న అజిత్ సరసన మళయాళ బ్యూటీ కీర్తి సురేష్ ని హీరోయిన్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.  

గతంలో ఓ ఇంటర్వ్యూలో తమిళ  హీరోల్లో అజిత్ అంటే బాగా ఇష్టమని ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందని  కీర్తి సురేష్ అన్నారు. తాజాగా ‘విశ్వాసం’ చిత్రంతో ఈ అమ్మడు అజిత్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడంతో  ఆమె కల నెరవేరబోతుందనే చెప్పాలి. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu