HomeTelugu Trendingకీర్తి సూరేశ్‌కు కరోనా పాజిటివ్‌

కీర్తి సూరేశ్‌కు కరోనా పాజిటివ్‌

keerthi suresh tested coron
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమ వణికిస్తోంది. నటీనటులు, ప్రముఖులు కోవిడ్‌, ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన హీరో మంచు మనోజ్‌, లక్ష్మి మంచు, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కరోనా రాగా తాజాగా ‘మహానటి’ కీర్తి సూరేశ్‌ కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది. అంటే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. మీరు మీ వాళ్ళు అంతా క్షేమంగా ఉండండి. త్వరగా రికవర్ అయి ఫాస్ట్ గా వస్తానని కోరుకుంటుంన్నాను’ అని పోస్ట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!