ప్రజలల్లో కరోనా వైరస్‌పై చైతన్యం కలిగించడానికి హీరోలు వీడియోలు ద్వారా తమ సందేశాలు ఇస్తూ తమతమ స్థాయిలలో విరాళాలు ఇస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ తమదైన స్టైల్ లో పాటలు పడుతూ అవగాహనా కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్‌పై చిరంజీవి, నాగర్జున, సాయి థరమ్ తేజ్, వరుణ్ తేజ్ కలిసి కోటి సారథ్యంలో పాట ఆలపించగా, వందేమాతరం శ్రీనివాస్ కూడా తనదైన స్టైల్‌లో ఓ పాట రూపొందించారు. ఈ సమయంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనదైన శైలిలో కరోనా వైరస్ గురించి పాటను తీసుకు వచ్చాడు. అయితే ఇది స్టూడెంట్ నెం.1 సినిమాలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటకు పేరడి. ప్రస్తుతం ఈ పాట నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
‘Thank you’ is the least we can say to all those great people who have pledged their lives to keep us safe and secured at home 🙏🙏🙏https://t.co/LrBC3HAl2s
— mmkeeravaani (@mmkeeravaani) March 31, 2020