యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాదాపు నాలుగేళ్ళు గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్నాడు. పోస్టర్‌ల నుంచి టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూనే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 3న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరే రిలీజ్ చేస్తుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కీడా కోలాపై మంచి అంచనాలు ఉన్నాయి.
షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ మొదలు పెట్టిన తరుణ్ భాస్కర్. మొదటి సినిమా ‘పెళ్ళి చూపులు’తో నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు.
తాజాగా వస్తున్న కీడా కోలా మూవీ కూడా కథనే హీరోగా పెట్టి తెరకెక్కించినట్లు టీజర్‌తోనే క్లారిటీ వచ్చేసింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తరుణ్ దర్శకత్వం వహించడమే కాకుండా ఓ కీలక పాత్ర కూడా చేస్తున్నాడు. బ్రహ్మానందం ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.