తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ, రేపు ఆయన ఆ వైదిక కార్యక్రమాలు జరిపించనున్నట్టు తెలిసింది. విశాఖ స్వరూపానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 48 మంది ఋత్విక్కుల సమక్షంలో రాజశ్యామల హోమం నిర్వహించనున్నారు. శృంగేరీ ఆస్థాన పండితులు ఫణిశశాంక్ శర్మ, గోపీకృష్ణశర్మ ఆధ్వర్యంలో 72 మంది ఋత్విక్కులు మహారుద్రసహిత చండీయాగం నిర్వహిస్తారు. సోమవారం మధ్యాహ్నం పూర్ణాహుతి పూర్తయ్యాక కేసీఆర్ ఎన్నికల సభలకు బయలుదేరి వెళ్తారు.