BRS Name Change:
ఆంధ్రప్రదేశ్ విభజన సమయం నుంచి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్) పార్టీకే మద్దతుగా ఉన్నారు. సపరేట్ తెలంగాణ వచ్చాక ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో భారీ విజయాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రూలింగ్ పార్టీగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
గతేడాది టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల తో భారీ షాక్ ఎదురయింది. రూలింగ్ పార్టీ కాస్త ఇప్పుడు ప్రతిపక్షం పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా మారారు. అయితే వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈసారి ఓడిపోయింది అనే విషయాలపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది.
అయితే దీని వెనుక ఉన్న చాలా కారణాల్లో ఒకటి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం. అది చాలా మంది ప్రజలకి నచ్చలేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో కేసీఆర్ 2022లో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. ఏ ముహూర్తాన పార్టీ పేరు మారిందో కానీ వెంటనే ఎన్నికల్లో ఓటమి ఎదురై పార్టీ పవర్ లో నుంచి దిగిపోయింది.
దీంతో జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణలో అయినా పార్టీని బతికించడానికి మళ్లీ పేరు మారిస్తే బెటర్ అని చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సమావేశంలో హరీష్ రావు కూడా టిఆర్ఎస్ కండువా కప్పుకొని వచ్చి పార్టీ పేరు మార్చాలని బలంగా కోరారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పిలుస్తామని చెబుతున్నారు. పార్టీ పేరుని మార్చడంలో ప్రధాన పాత్ర పోషించానని, అందుకే పార్టీ ఓటమిలో తనకి కూడా భాగం ఉంది అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
కానీ కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంటుగా పార్టీ పేరు మార్చుకుండా కూర్చున్నారు. దీంతో ఇకనైనా కేసీఆర్ కళ్ళు తెరిచి పార్టీ పేరు మారిస్తే కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా పోయిన పవర్ తిరిగి వచ్చే అవకాశం ఉంది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.