ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయ్. అది కామన్ అని సరిపెట్టుకోవచ్చు. అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షాలు దాడి చేయడం సహజం. కానీ, పొరుగు రాష్ట్రం సీఎం సైతం విమర్శలు చేస్తున్నారంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నేషనల్ లెవల్ ఎనలిస్టులు సైతం కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది.
జగన్ రెడ్డికి తెలంగాణ సీఎం కెసిఆర్ మిత్రుడు కంటే ప్రియమైన శత్రువు అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఏపీలో పాలన పట్ల కెసిఆర్ ఎప్పుడు పొగిడింది లేదు. అలాగని, విమర్శలు చేయడం లేదు. కానీ, వీలు చిక్కిన ప్రతిసారి తన పాలన గురించి చెప్పే క్రమంలో ఏపీ ప్రస్తావన తీసుకొస్తున్నారు. దాంతో జగన్ పార్టీ చిక్కుల్లో పడుతుంది.
కెసిఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి కెటిఆర్ ఆ మధ్య ఏపీలో రోడ్స్ గురించి కామెంట్ చేశారు. యథావిథిగా ఏపీ మంత్రులు ఎదురుదాడి చేశారు. అంతే గానీ తమ రాష్ట్రంలో అద్భుతమైన రోడ్స్ ఉన్నాయని చెప్పుకోలేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోడ్స్ మీద ఏపీని ఏకిపారేసిన రోజులున్నాయి. దాంతో వైసిపి కౌంటర్ ఎటాక్ చేయడం తప్ప కాదని గట్టిగా చెప్పలేకపోయింది.
తెలంగాణ వెలిగిపోతుంటే, ఆంధ్రలో చిమ్మ చీకటి ఉందని ఇప్పుడు సీఎం కెసిఆర్ కామెంట్ చేశారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఏపీ గవర్నమెంట్ నుంచి ఎవరు స్పందించలేదు. ఏం అంటారో చూడాలి.
తెలంగాణ ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్ రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులు తెస్తుంటే ఏపీ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఆంధ్ర జనాలు కంపేర్ చేస్తున్నారు. పలు శాఖల పరంగా ఏపీ మంత్రులు ఈ పోలికలు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి విషయంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య పోలికలు తీస్తున్నారు జనాలు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తమ పాలన గొప్పదనం చెప్పే క్రమంలో జగన్ గాలి తీసి పారేస్తున్నారు. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు చేస్తున్నారు. మరి, వైసిపి ఎదురు దాడి చేస్తుందా? లేదంటే ఇదీ తమ అభివృద్ధి అని చెబుతుందా?
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు