Homeతెలుగు Newsతెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం

4 12తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1.25 గంటలకు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అనే నేను.. ‘ అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్‌ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ‌కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు.

తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ 2014 జూన్‌ 2న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈసారి అందుకు భిన్నంగా కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 11మంది ప్రమాణం చేసినప్పుడు కూడా వారిలో మహమూద్‌ అలీ ఉండడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu