HomeTelugu Big Storiesమంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ ముమ్మర కసరత్తు

మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ ముమ్మర కసరత్తు

14 7

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు అవుతున్నా మంత్రివర్గం ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం అనంతరం పాలనపై దృష్టిసారించి సీఎం, తాజాగా మంత్రివర్గ విస్తరణ కార్యాచరణకు పూనుకున్నారు. డిసెంబరు 13న సీఎంగా కేసీఆర్‌, హోం మంత్రిగా మహమూద్‌అలీ బాధ్యతలు చేపట్టారు. దీంతో మంత్రిర్గంలో తొలి విడత 8 మందికి చోటు దక్కనుందని తెలుస్తోంది. డిసెంబరు చివరినాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం నిర్ణయించారు. దీనికి మరో 10 రోజుల గడువున్నప్పటికీ మంగళవారం నుంచే ఎంపిక ప్రక్రియను ప్రారంభించి, దాదాపు 8 గంటల పాటు పరిశీలన జరిపినట్టు సమాచారం.

ఈ దఫా కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించే అవకాశముంది. ఈసారి కేబినెట్ ఏర్పాటును కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోబోతున్నారు, మంత్రుల ఎంపికపై పనితీరు ఆధారంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు స్వతంత్రులతో సహా మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీల జాబితాను తెప్పించి, అధ్యయనం చేస్తున్నారట. వ్యక్తులు కాకుండా, సమర్థులనే నియమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, వీరిలో ఎవరు తనకు వీర విధేయులో వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన యోచన. సామాజిక సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకుని పదవులు కేటాయించాలని చూస్తున్నారట.

ఎవరెవరికి ఎలాంటి స్థానం కల్పించాలి.. ఉద్యమకారులు, ఎమ్మెల్యేలుగా ఉండి పదవులను వీడి పార్టీలో చేరినవారు, ప్రస్తుత ఎన్నికల్లో వారి మెజారిటీ ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో పాతవారికి అవకాశం కల్పించాలని గతంలో వారి పనితీరు, ఎన్నికల్లో గెలుపు అంశాలను పరిగణనలోకి తీసున్నట్టు తెలుస్తోంది. బుధ, గురువారాల్లోనూ కేబినెట్ కూర్పుపై అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. తొలివిడత మంత్రివర్గంలోకి తీసుకునే 8 మందిని ఎంపిక చేసిన తర్వాత వారిని పిలిచి మాట్లాడాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu