బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన అందాలతో హాట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నది. అంగాంగ ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు కత్రినా. సినిమాకానివ్వండి.. ఫోటో షూట్ కానివ్వండి ఏదైనా సరే రెడీ అంటూ.. రెచ్చిపోతున్నది. ఇటీవలే ఆమె నటించిన తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లోని సాంగ్ లో కావాల్సినంత అందాల విందు భోజనం అందించింది.
తాజాగా ఈ అమ్మడు ఇండియన్ వోగ్ మ్యాగజైన్ కోసం ఫోజులు ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో కత్రినా చాలా అందంగా అనిపించింది. హీరోయిన్లకు నటన పెద్దగా రాకపోయినా పర్వాలేదు.. గ్లామర్ ఉంటె సరిపోతుంది. స్కిన్ షో కు అడ్డు చెప్పకుండా ఉంటె ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పడానికి కత్రినానే ఓ ఉదాహరణ. దశాబ్దకాలానికి పైగా అలాగే నెట్టుకొస్తున్నది.