HomeTelugu Trendingతల్లి కాబోతున్న కత్రినా కైఫ్?

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్?

Katrina kaif pregnant rumou

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. గతేడాది హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా కత్రీనా కైఫ్ ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

పింక్ కలర్ చుడిదార్ లో బొట్టు పెట్టుకొని సింపుల్ గా ఉన్న కత్రినా ఎంతో అందంగా కనిపించింది. ఇ ఈ వీడియో చుసిన పలువురు నెటిజన్లు.. కత్రినా ప్రెగ్నెంట్ అని పుకార్లు పుట్టించారు. ఆమె నడుస్తున్న తీరు, కొద్దిగా లూజ్ డ్రెస్ లో బొద్దుగా కనిపించడంతో కత్రినా త్వరలో తల్లికాబోతుందని ప్రచారం మొదలుపెట్టేశారు. కత్రినా.. ప్రెగ్నెంట్ అనుకుంటా.. ?.. ఓరి దేవుడా ఆమె అచ్చు గర్బవతిలానే బిహేవ్ చేస్తోంది.. కత్రినా త్వరలో తల్లి కాబోతున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్ల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తుంది. మరి ఈ వీడియోపై ఈ స్టార్ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Recent Articles English

Gallery

Recent Articles Telugu