HomeTelugu Big Storiesకత్రినా- విక్కీ పెళ్లి ఫొటోలు.. వైరల్‌

కత్రినా- విక్కీ పెళ్లి ఫొటోలు.. వైరల్‌

Katrina kaif and vicky kaus

బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వైవాహికబంధంతో ఒక్కటైయ్యారు. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో వీరి వివాహం వైభవంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది అతిథుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

Katrina kaif 1

ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’ అంటూ పోస్ట్‌ షేర్‌ చేశారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu