HomeTelugu Trendingవేడుకగా కత్రినాకైఫ్‌, విక్కీకౌశల్‌ 'రోకా' ఫంక్షన్!

వేడుకగా కత్రినాకైఫ్‌, విక్కీకౌశల్‌ ‘రోకా’ ఫంక్షన్!

Katrina kaif and vicky kausబాలీవుడ్‌ ప్రేమ జంట కత్రినాకైఫ్‌, విక్కీకౌశల్‌ త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ నెలలో వీరి వివాహం జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విక్కీ-కత్రినాలకు దీపావళి రోజున రోకా ఫంక్షన్‌ జరిగినట్లు సమాచారం. కత్రినాకు ఎంతో ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో ఈ వేడుక నిర్వహించారట. కత్రినా, ఆమె తల్లి సుజానే టర్కోయెట్, ఇసాబెల్, విక్కీ, ఆయన తల్లిదండ్రులతోపాటు సోదరుడు సన్నీ కౌశల్‌ ఈ వేడుకలో పాల్గొని.. వివాహానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారట.

Katrina kaif 1

ఇరు కుటుంబాలు పలు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఉత్తర భారతదేశంలో రోకా ఫంక్షన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వధూవరుల కుటుంబసభ్యులు ఒకచోట కలుసుకుని పెళ్లి తంతు, కట్నకానుకలపై మాట్లాడుకుని.. అన్నీ ఓకే అనుకున్నాక స్వీట్స్‌, ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

Katrina kaif 2

విక్కీ-కత్రినా కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. కత్రినా అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలు సందర్భాల్లో విక్కీ బయటపెట్టారు. మరోవైపు డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu