ప్రముఖ సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయన తల, ఎడమ కంటికి తీవ్ర గాయమైందని, ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాద విషయంపై సమాచారం అందడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను సాయంత్రంలోగా వైద్యులు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.