సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కొన్ని నెలల క్రితం ఫేస్బుక్, ట్విటర్లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు కత్తి మహేష్. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి. గతంలో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అలా పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆయనపై హైదరాబాద్‌లో ఓసారి దాడి కూడా జరిగింది