HomeTelugu Trending'కథ కంచికి మనం ఇంటికి' ట్రైలర్‌

‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌

katha kanchiki manam intiki
టాలీవుడ్‌ యంగ్ హీరో తిృగున్‌, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చాణిక్య చిన్న దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ ని విడుదల చేశారు మేకర్స్‌.

తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది. సప్తగిరి, గెటప్‌ శ్రీనుల కామెడీ నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్‌ మాదిరే సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu