HomeTelugu Big Storiesరివ్యూ: కాటమరాయుడు

రివ్యూ: కాటమరాయుడు

నటీనటులు: పవన్ కల్యాణ్, శృతి హాసన్, శివ బాలాజి, అజయ్, తరుణ్ అరోరా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం ‘కాటమరాయుడు’. పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ వీరమ్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ కాటమరాయుడు సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
కాటమరాయుడు(పవన్ కల్యాణ్) సీమలో పేరున్న మనిషి. ఎవరిని అన్యాయం జరిగిన న్యాయం చేయమని రాయుడు ఇంటికే వెళ్తారు. రాయుడు తన నలుగురు తమ్ముళ్ళు, స్నేహితుడు లింగం(అలీ)తో కలిసి జీవిస్తుంటాడు. వీరి కుటుంబానికి అమ్మాయిలంటే పడదు. అన్నయ్య కోసం అమ్మాయిలకు దూరంగా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా.. కాటమరాయుడు ముగ్గురు తమ్ముళ్ళకు లవర్స్ ఉంటారు. స్నేహితుడు లింగం కూడా ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. దీంతో కాటమరాయుడుని కూడా ప్రేమలో దించితే కానీ వారి వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ దొరకదని అన్నయ్యని ప్రేమలోకి దింపడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈలోగా రాయుడు ఎదురింట్లోకి భరతనాట్యం చేసే బృందం ఒకటి దిగుతుంది. రాయుడు గుడిలో చూసిన అమ్మాయి అదే బృందంలో ఉండడం గమనిస్తాడు. తనే అవంతి(శృతిహాసన్). అవంతి, రాయుడిని ఇష్టపడుతుంది. రాయుడు కూడా కొన్ని రోజులకి తన ప్రేమ విషయాన్ని అవంతికి చెబుతాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో రాయుడుపై కొందరు దాడి
చేస్తారు. ఆ గొడవలు చూసిన అవంతి భయపడిపోయి రాయుడికి దూరంగా వెళ్లిపోతుంది. అసలు రాయుడుపై దాడి చేసిన ఆ దుండగులు ఎవరు..? వారు రాయుడు కోసం వచ్చారా..? లేక అవంతి కోసం వచ్చారా..? రాయుడుని అవంతి తిరిగి ప్రేమిస్తుందా..? తన ప్రేమ కోసం రాయుడు గొడవలకు దూరంగా ఉంటాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
తమిళ వీరమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన కాటమరాయుడు సినిమా కోసం పవన్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూశారు. సర్ధార్ సినిమా తరువాత పవన్ చేస్తోన్న సినిమా కాబట్టి హిట్ కోసం అటు అభిమానులు కానీ ఇటు పవన్ అండ్ కో గానీ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, కావాలని కాటమరాయుడు ట్రైలర్ పై నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ఇన్నీ చేశారు యాంటీ ఫ్యాన్స్. కానీ ఈరోజు పవన్ కల్యాణ్ అభిమానైన ప్రతి ఒక్కరూ కాలర్
ఎత్తుకొని మరీ చెప్పుకొనే సినిమా కాటమరాయుడు.

సింపుల్ గా పవన్ అదరగొట్టేశాడంతే. ఈ సినిమాకు పెద్ద హైలైట్ పవన్ కల్యాణ్. పంచెకట్టు, మీసంతో చాలా అందంగా కనిపించాడు. రాయలసీమ యాసను తన మాటల్లో పలికించాడు. కామెడీ విషయంలో కూడా పవన్ టైమింగ్ బావుంది. ప్రతి సీన్ లో, యాక్షన్ సన్నివేశాల్లో ఎమోషన్స్ ను బాగా పండించాడు. తన నలుగురు తమ్ముళ్ళకు పవన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పవన్, శృతిహాసన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే లవ్ ప్రపోజల్ సీన్ ఆకట్టుకుంది. పవన్ చెప్పే చిన్న డైలాగ్స్ కూడా తూటాళ్ళ పేలాయి.

సినిమా మొదటి భాగంలో కామెడీ బాగా హైలైట్ అయింది. సెకండ్ హాఫ్ మొదలవ్వగానే కాస్త ల్యాగ్ అనిపించినా.. స్క్రీన్ మీద పవన్ కనిపిస్తే అది కూడా మర్చిపోతారు. అనూప్ తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. ఇంటర్వల్ బ్యాంగ్ కు ముందు వచ్చే సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే ఎలివేట్ చేయాల్సివుంది. కానీ అక్కడ ఆ స్థాయి మ్యూజిక్ అందివ్వలేకపోయాడు. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా పనితనం ఆకట్టుకుంది. దర్శకుడు డాలీ తన పనికి పూర్తి న్యాయం చేశాడు. సినిమా మొదలవ్వడానికి ముందు ఎంతమంది దర్శకులు మారినా.. ఫైనల్ గా డాలీ బెస్ట్ ఆప్షన్ అనిపించుకున్నాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునే సినిమా ‘కాటమరాయుడు’.
రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu