సరైనోడు సినిమాతో టాలీవుడ్ లో ప్రీరిలీజ్ ఫంక్షన్ల హవా మొదలైంది. శ్రీరస్తు శుభమస్తు, దృవ, ఖైదీ నెంబర్ 150, విన్నర్ ఇలా చాలా సినిమాలకు ఆడియో ఫంక్షన్స్ చేయకుండా.. ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్నాడు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాలో పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసి ఈ నెల 18న గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
మరి ట్రైలర్ ను కూడా అదే రోజు విడుదల చేస్తారా..? లేక ముందుగానే విడుదల చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. ఇది ఇలా ఉండగా పవన్ కల్యాణ్ తన టీం తో కలిసి ఈ శనివారం యూరప్ కు బయలుదేరి వెళ్లనున్నాడు. అక్కడ మిగిలిన రెండు పాటల చిత్రీకరణ జరిపి మార్చి 14న తిరిగి రానున్నారు. మరి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్ లో జరుగుతుందో.. తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!