పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్ర బృంధం విజయవంతంగా పొల్లాచ్చిలో షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. “చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ ‘కాటమరాయుడు’లో మరోసారి కనువిందు చేయబోతోంది. ‘పొల్లాచ్చి లో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు’ అని నిర్మాత శరత్ మరార్ చెప్పారు. దర్శకుడు కిశోర్ పార్దసాని మాట్లాడుతూ.. ”పవన్ కల్యాణ్ గారితో రెండవ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మిగిలిన షూటింగ్ పార్ట్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో ‘ఉగాది’ కి విడుదల అవుతుంది” అన్నారు.