‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమా టాలీవుడ్‌లో హీరోగా పరిచయమై, ‘ఆర్‌ఎక్స్ 100’తో యువతలో సంచలనం సృష్టించాడు కార్తికేయ. వీటి కంటే ముందే ‘ఆపరేషన్ ఐపీఎస్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడే మోహన్‌కాంత్. ‘ఫైనల్ సెటిల్‌మెంట్’ అనే చిత్రంలో నటించాడు కార్తికేయ. అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని స్వీయ నిర్మాణంలో జమ్మలమడుగు మోహన్ కాంత్ తెరకెక్కించారు. హైదరాబాద్- వరంగల్ నగరాలకు చెందిన రెండు బృందాలు ఓ అనాథాశ్రమాన్ని దోచుకునే ప్రయత్నంలో వాళ్ల మధ్య ఏం జరిగిందనే ఆసక్తికర అంశాలతో రూపొందింది. ‘కార్తికేయ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో అతనిలోని నటుడ్ని గుర్తించి ఈ చిత్రంలో విలన్ ఛాయలున్న పాత్రని ఇచ్చినట్టు’ తెలిపారు దర్శక-నిర్మాత మోహన్ కాంత్. ఈ చిత్రానికి ఎస్.బి సంగీతం అందించాడు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళీ, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు.