క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించనుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక కీలకమైన పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని అంటున్నారు. అయితే అది ప్రత్యేకమైన పాత్రనా? లేదంటే విలన్ పాత్రనా? అనే విషయంపై స్పష్టత రావలసి వుంది. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. అందువలన ‘ఫైటర్’ సినిమాలోను ఆయన విలన్ గా కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.