HomeTelugu Trendingకార్తికేయ '90ML' రీలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కార్తికేయ ’90ML’ రీలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

4 9హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ’90 ML’. అశోక్ గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాకి, శేఖర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా ద్వారా ‘నేహా సోలంకి’ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు.

ఈ పోస్టర్ లోని కార్తికేయ యాక్షన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, “ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చే 3 రొమాంటిక్ సాంగ్స్ ను ‘అజర్ బైజాన్’లో చిత్రీకరించాము. ఈ 3 పాటలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇది కార్తికేయకి గల క్రేజ్ కి .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమా అవుతుంది” అని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu