అక్కినేని నాగ చైతన్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NC22 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఈ రోజు మొత్తం ఈ సినిమాలో తారాగణాన్ని పరిచయం చేసారు.
ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మిగతా ప్రధాన పాత్రల్లో కనిపించే నటీనటులను శుక్రవారం ఉదయం నుంచీ మేకర్స్ వరుస అప్డేట్ లతో ప్రకటిస్తూ వస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అలానే తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్, ప్రియమణి, కోలీవుడ్ కమెడియన్ ప్రేమ్ జీ అమరన్ – వెన్నెల కిషోర్, విలక్షణ నటుడు సంపత్ రాజ్ ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ‘కార్తీక దీపం’ సీరియల్ తో ‘వంటలక్క’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రేమి విశ్వనాథ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. తమిళ హీరో జీవా అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
నాగచైతన్య డెబ్యూ తమిళ్ మూవీ కోసం అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులను తీసుకోవడం అభిమానులను మరియు ప్రేక్షకులను ఆనందపరుస్తోంది. ఇందులో చైతూ ఒక పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న మేకర్స్.. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.