తమిళ్ నటుడు కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘ఖైదీ’. తమిళ, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని విడుదలైన దేశాల్లో మంచి వసూళ్లు రాబడుతున్నది. పాటలు, డ్యాన్స్, హీరోయిన్ లేకుండా సినిమాను కేవలం కథను నమ్ముకొని తీశారు. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది. తెలుగులో సైతం ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. కాగా, ఈ సినిమా ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది.
కార్తీ హీరోగా చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఖైదీ నిలవడం విశేషం. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ ఎలాగైతే మలుపుగా మారిందో.. తమిళ్ హీరో కార్తీకి ఖైదీ సినిమా అలానే అని చెప్పుకోవచ్చు. ఖైదీ సినిమాతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. డిసెంబర్ 20 వ తేదీన కార్తీ తమ్ముడు (తంబీ) గా రాబోతున్నాడు.