తమిళ నటుడు కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అతను నటించిన పలు సినిమాలు హిట్‌గా నిలిచాయి. డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులతో ప్రేక్షకులను ఆకట్టుకునే కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘జపాన్’. కార్తీ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
జపాన్ ఎంట్రీ వీడియో పేరుతో మేకర్స్ చేసిన ట్వీట్ లో ‘మా జపాన్ వచ్చేశాడు.. మేడిన్ ఇండియా’ అంటూ పేర్కొన్నారు. ఇక టీజర్ లో.. ‘మీరనుకుంటున్నట్టు కాదు.. వాడు దూల తీర్చే విలన్’ అంటూ సునీల్ చెబుతున్న డైలాగ్స్‌తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు కార్తీ. ఆయన క్రేజీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ చివర్లో పోలీసులు చుట్టుముట్టడం, కార్తీ తల ఆడిస్తూ కూర్చుకోవడం.. ఆయన పళ్లకు క్లిప్.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సునీల్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది.
ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటిస్తుంది. దర్శకుడు రాజు మురుగన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజా వీడియోతో ప్రకటించేశారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు