తమిళ చిత్ర పరిశ్రమకు రమ్మన్నారు.. వచ్చేశా అంటున్నారు హీరోయిన్ రష్మిక. కార్తి హీరోగా ‘రెమో’ ఫేం బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించబోతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఇది రష్మిక తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను రష్మిక ట్విటర్లో షేర్ చేశారు. ‘నన్ను నటిగా కన్నడ, తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. 2019లో కోలీవుడ్‌కు రమ్మని మీరూ అడిగారు (కోలీవుడ్ ఫ్యాన్స్), చివరికి వచ్చేశా. మీకు నా అమితమైన ప్రేమను పంపుతున్నా. కార్తి, తదితర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె పోస్ట్ చేశారు.
రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తున్నారు. మార్చి 17న ఈ మూవీ టీజర్ విడుదల కాబోతోంది. అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించబోతున్న సినిమాలోనూ హీరోయిన్ పాత్ర పోషించబోతున్నారు. ఇందులో నితిన్ హీరో. ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. మహేశ్‌బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు కూడా రష్మిక సంతకం చేసినట్లు సమాచారం.
I’ve always had such great support from my Kannada and Telugu people..✨💕And you Have also been asking me to come to tamil and in 2019..I finally am!!😎 I am so happy to be doing a film with this team.இதுவொரு புதிய துவக்கம்✨ with loads of love from me to you!😘♥ pic.twitter.com/LaVZJLdVll
— Rashmika Mandanna (@iamRashmika) March 13, 2019