HomeTelugu News6వేల కోళ్లను సజీవ సమాధి చేసిన కర్ణాటక పౌల్ట్రీ రైతు

6వేల కోళ్లను సజీవ సమాధి చేసిన కర్ణాటక పౌల్ట్రీ రైతు

10 9
చైనాలో మొదలైన ప్రపంచ మొత్తాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌.. భారత పౌల్ట్రీ రైతులపై ప్రభావం భారీగానే చూపిస్తోంది. చికెన్‌ తినడం ద్వారా కరోనా వస్తుందంటూ రకరకాలుగా వదంతులు ప్రచారం కావడంతో చికెన్‌కు పెద్దమొత్తంలో డిమాండు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. దీనికి కర్ణాటకలోని ఓ రైతు చేసిన పనే ఉదాహరణ. ఆ రైతు దాదాపు ఆరు వేల కోళ్లను సజీవంగా పూడ్చివేయడం సంచలనం సృష్టించింది. అంతేకాదు తన బాధను అందరికీ తెలియజేసేందుకు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

నజీర్‌ అహ్మద్‌ అనే రైతు కర్ణాటకలోని గోకక్‌ తాలుకా.. నల్సూర్‌ గ్రామంలో నివసిస్తున్నారు. ఇటీవల కరోనా వదంతుల కారణంగా చికెన్‌కు డిమాండు పడిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఆరు వేల కోళ్లను గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టాడు. కాగా దీనిపై అహ్మద్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వదంతుల కారణంగా చికెన్‌ విలువ బాగా తగ్గిపోయింది. కిలో చికెన్‌ రూ.5 నుంచి 10కి అమ్ముడుపోతోంది అన్నారు. కోళ్లను పెంచడానికి తనకు రూ.6లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పాడు. ఇప్పటికీ తాను వాటిని ఇంకా నిర్వహించాలంటే నష్టపోవడమే తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అతడు కోళ్లను పూడ్చివేసిన వీడియో వైరల్‌ కావడంతో.. పలువురు నెటిజన్లు అహ్మద్‌ చేసిన పనిపై మండిపడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu