బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలే రెండోవ కొడుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబు పుట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అతడి ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. తాజాగా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ హీరోయిన్ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కరీనా. “మహిళకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో కరీనా బాబుని తన భుజాలపై పడుకోబెట్టింది. దీంతో అతడి ముఖం కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడుతున్నారు. కాగా 2012లో కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016 డిసెంబర్‌లో తైమూర్ జన్మించాడు. ఇక కరీనా చేతిలో ‘లాల్‌సింగ్ చద్దా’, ‘తాకత్’ సినిమాలున్నాయి.
View this post on Instagram