బాహుబలి సినిమాతో.. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప్రభాస్.. ఓ వైపు సలార్, మరో వైపు ప్రాజెక్ట్ K చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే ప్రభాస్ కోసం మరో రెండు క్రేజీ సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. ఒకటేమో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. మరోటేమో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రూపొందనుంది.
కాగా.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా చిత్రం యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఆవిష్కృతం కానుండగా అందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడనే విషయం తెలిసిందే. స్పిరిట్ పేరుతో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ హీరోయిన్గా నటించనుంది అని టాక్. ఇప్పుడు ప్రభాస్ చేస్తోన్న చిత్రాల్లో బాలీవుడ్ హీరోయిన్సే నటిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో కరీనా కపూర్ చేరనుందని వినికిడి.
అయితే ఈ సినిమాలో నటించడానికి కరీనా కపూర్ భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట. అంతా ఇంతా కాదు.. ఏకంగా రూ. 17 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. అయితే కరీనా కపూర్ ఇప్పటికే ఇద్దరి పిల్లల తల్లి.. బాలీవుడ్లోనే ఆమెకు అంతగా అవకాశాలు లేవు. మరిప్పుడు ఆమెను ప్రభాస్ సినిమాలో తీసుకోవటానికి రీజనేంటి? హీరోయిన్గానేనా!.. లేక మరేదైనా ప్రధాన పాత్ర కోసమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై ప్రభాస్ అండ్ టీం ఎలా స్పందిస్తారో.. చూడాలి.