HomeTelugu Trendingసుశాంత్‌పై కరీనాకపూర్‌ చీప్‌ కామెంట్స్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

సుశాంత్‌పై కరీనాకపూర్‌ చీప్‌ కామెంట్స్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

3 18బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత ఇండస్ట్రీలోని కొన్ని కుటుంబలపై అభిమానులు విమర్శలు చేస్తున్నారు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చే వారిని వీరు ఎదగనీయడం లేదని విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. జనాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో కపూర్ లు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో సుశాంత్ ను ఉద్దేశించి గతంలో నటి కరీనాకపూర్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు.

గతంలో సారా అలీఖాన్ తో కలిసి కరీనాకపూర్ ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సుశాంత్ పై చీప్ కామెంట్లు చేసింది. ‘సారాకు నీవు ఇచ్చే డేటింగ్ టిప్ ఏమిటి?’ అని వ్యాఖ్యాత ప్రశ్నించగా… ‘నీ మొదటి హీరోతో మాత్రం డేటింగ్‌కు వెళ్లొద్దు’ అని సారాకు చెప్పింది. అంతేకాదు సుశాంత్ ను చెత్త మొహం అని కూడా విమర్శించింది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కరీనాపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరీనాకు పొగరు ఎక్కువని, ఆమెకు అసలు టాలెంటే లేదని విమర్శిస్తున్నారు. కేవలం కపూర్ అనే పేరు వల్లే హీరోయిన్ అయిందని విమర్మలు చేస్తున్నారు. ‘బాయ్ కాట్ కరీనా’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu