ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ‘కరణం బలరామకృష్ణ మూర్తి’. ఒంగోలు పులిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సుపరిచితుడిగా కరణం బలరామకృష్ణ మూర్తి అలియాస్ ‘కరణం బలరాం’కి మంచి పేరు ఉంది. గుంటూరు జిల్లా చీరాల తాలూకా లోని తిమ్మసముద్రం గ్రామంలో ఆయన జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బలరాం విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ పూర్తి చేయడం జరిగింది. బలరాం కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయన తాత గారు కరణం నరసింహం గ్రామ మునుసుబుగా అలాగే చీరాల తాలూకా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. మేనమామ పాటిబండ్ల గోపాలస్వామి ఉమ్మడి ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు. బలరాం విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి విజయవాడ లయోలా కళాశాలలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. విద్యార్థి రాజకీయాల తర్వాత మేనమామ గోపాల స్వామి ప్రోద్బలంతో యువజన కాంగ్రెస్ లో చేరి గుంటూరు జిల్లాలో కరణం బలరాం కీలకమైన నేతగా ఎదుగుతూ వచ్చారు.
1978లో కాంగ్రెస్ తరఫున అద్దంకి నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. 1983 లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన మిత్రుడు చంద్రబాబు తో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరి, అనంతరం 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మార్టూరు నియోజకవర్గం నుండి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1993లో కాంగ్రెస్ పార్టీ లో చేరి 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1997లో టీడీపీలో మళ్లీ తిరిగి చేరి, ఏపీ అగ్రోస్ స్టేట్ డైరెక్టర్ గా మరియు ఏపీ ఎస్టేట్ & టెలికాం ఛైర్మన్ గా పనిచేశారు. 1999 లో ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లో అద్దంకి నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో చీరాల నుంచి పోటీ చేసి ఐదో సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.
అయితే, 2019లో తెదేపా ఓడిపోవడంతో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నాడు. కరణం బలరాం తొలి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత బలమైన రాజకీయ నాయకుడిగా వెలిగిపోతూ వస్తున్నారు. ఐతే, కరణం బలరాం తొలి నుంచి రాజకీయంగా మరియు వ్యక్తిగతంగా వివాదాస్పద నేత. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు కిషోర్ బాబు హత్య కేసులో నిందితుడిగా కూడా రుజువు అయ్యారు. దాంతో, వెంటనే కాంగ్రెస్ పార్టీ లో చేరి కేసు మాఫీ చేసుకున్నారు. అలాగే, కరణం బలరాం తన రెండో వివాహాన్ని గోప్యంగా ఉంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే కరణం బలరాం జీవితంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయి.
ఇంతకీ ప్రజల్లో కరణం బలరాం పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు కరణం బలరాం కి మళ్లీ గెలిచే సత్తా ఉందా ? చూద్దాం రండి. కరణం బలరాం గ్రాఫ్ విషయానికి వస్తే.. ఆయన గ్రాఫ్ డిజాస్టర్ దిశగా సాగిడుతుంది. రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్నా.. ఆయన గొప్ప రాజకీయ నాయకుడిగా నేటి సమాజంలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తనను గెలిపించిన ప్రజలకు తనేం చేయలేకపోయాడు. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం ఎట్టిపరిస్థితిలో గెలవడు. అందుకే, కరణం బలరాం ఈ సారి మళ్లీ పోటీ చేసే ఆలోచనలో కూడా లేడు. దీనికితోడు కరణం బలరాం కి టికెట్ ఇచ్చే ఆలోచనలో కూడా జగన్ రెడ్డి లేడు. ఒకవేళ టికెట్ ఇచ్చినా కరణం బలరాంకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదు.