HomeTelugu Newsవిమర్శల నేపథ్యంలో కరణ్ జోహార్ కీలక నిర్ణయం

విమర్శల నేపథ్యంలో కరణ్ జోహార్ కీలక నిర్ణయం

12 9
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత అనేక మంది విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే కరణ్‌ జోహార్ ఎక్కువగా సినీ ప్రముఖుల పిల్లలతో సినిమాలు నిర్మించడమే కారణం. స్టార్‌ కిడ్స్‌కు తప్ప బయటి నుంచి వచ్చిన వారికి ఇండస్ట్రీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని, వారిని చిన్నచూపు చూస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి కారకుల్లో కరణ్‌ జోహార్ కూడా ఒకరని పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌లో జరుగుతున్న అన్యాయాలపై వరుసగా పలువురు గళమెత్తుతున్నారు. సుశాంత్‌ సింగ్ మరణం అనంతరం కరణ్‌ జోహార్ ట్విట్టర్‌లో పలువురు అన్‌ ఫాలో చేశారు. ప్రస్తుతం ఆయనను కొందరు మాత్రమే ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు తన బ్యానర్‌లో సినీ ప్రముఖుల వారసులతో సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే ప్లాన్‌ చేసుకున్న కొన్ని సినిమాలను సైతం రద్దు చేసుకునే యోచనలో ఉన్నాడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu