సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాలో రజనీకాంత్ ముఖ్య అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఈమూవీ కి ఆయన కుతురూ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో లెజెండరీ క్రికెటర్, భారత్‌కు తొలిసారి ప్రపంచకప్‌ను అందించిన హర్యానా హరికేన్ కపిల్‌దేవ్ నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌తో కలిసి తీయించుకున్న ఫొటోను రజనీకాంత్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
‘లెజెండరీ పర్సన్’. మనందరం గౌరవించే గొప్ప మనిషి కపిల్‌దేవ్‌గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ ప్రపంచకప్‌ను సాధించి దేశం గర్వపడేలా చేశారాయన అంటూ ఫొటోకు వ్యాఖ్యను జత చేశారు. కపిల్‌దేవ్ సైతం రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిచ్చిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు